Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట పొలంలో భారీ మొసలి .. జడుసుకున్న రైతు

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (11:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరులోని పంట పొలాల్లో ఓ భారీ మొసలి కనిపించింది. దీన్ని చూసిన రైతులు జడుసుకున్నారు. అదేసమయంలో ఈ మొసలి రైతులను కూడా ముప్పతిప్పలు పెడుతుంది. గ్రామానికి చెందిన బాల్ రెడ్డి ఆదివారం గ్రామ సమీపంలోని చెరువు వెనుక ఉన్న తన వరిపొలం వద్దకు వెళ్లాడు. అపుడు ఆయన పొలం గట్టుపై నడుస్తుండగా పొలంలో భారీ మొసలి కనిపించింది. దీంతో ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. 
 
గట్టుపై అలికిడి కావడంతో మొసలి పక్కనే ఉన్న సర్పంచ్ శ్రీనివాసరెడ్డి పొలంలోకి పాకుకుంటూ వెళ్లిపోయింది. ఆయన సర్పంచ్‌‍కు ఫోన్ చేసి భారీ మొసలి గురించిన సమాచారం అందించారు. ఆయన వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీకి నిర్వాహకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించగా, ఆయన తన సిబ్బందితో అక్కడకు వచ్చి ఆ మొసలిని బంధించే ప్రయత్నం చేశారు. 
 
అయితే, వారికి వీలుపడకపోవడంతో ప్రొక్లైన్ సాయంతో మొసలి బంధించి పంట పొలాల నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడకు చేరుకోవడంతో వారంతా కలిసి మొసలిని తాళ్ళతో బంధించిన అటవీ శాఖ అధికారులు సూచన మేరకు జూరాల ప్రాజెక్టులో వదిలిపెట్టారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments