Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మిల్లెట్ మ్యాన్' ఇకలేరు.. అనారోగ్యంతో పీవీ సతీష్ కన్నుమూత

milletman sathish
, సోమవారం, 20 మార్చి 2023 (08:19 IST)
దేశంలో మిల్లెట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన పీవీ సతీష్ (77) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1985లో జహీరాబాద్ డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది. అలాగే, ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 
 
ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఢిగ్రీ పూర్తి చేసిన ఆయన 20 యేళ్ల పాటు దూరదర్శన్‌లో కార్యక్ర ప్రధాన నిర్వాహకుడుగా విధులు నిర్వహించారు. 1970లో నాసా, ఇస్రో కలిసి నిర్వహించిన శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనలో టెలివిజన్ (సైట్) ప్రయోగంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత కొందరు మిత్రులతో కలిసి 1985లో జహీరాబాద్‌‍ సమీపంలోని పస్తాపూర్‌లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) స్థాపించారు. 75 గ్రామాల్లోని 5 వేల మందికి ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను 2019లో ఐరాస డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఈక్వేటర్ ప్రైజ్, ప్రిన్స్ ఆల్బర్ట్, మొనాకో ఫౌండేషన్ అవార్డు వంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 
 
ఆయన తన విశిష్ట సేవతో చిరు ధాన్యాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకుని రావడంతో జహీరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. డీడీఎస్ మహిళా రైతు సంఘాల నిర్వహణలో దేశంలోనే తొలిసారిగా సంఘం రేడియోను ప్రారంభించారు. కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ ద్వారా గ్రామీణ మహిళలను డాక్యుమెంటరీ, లఘు చిత్రాల రూపకర్తలుగా ఆయన తీర్చిదిద్దారు. జీవితాంతం అవివాహితుడుగా ఉన్న మిల్లెట్ సతీష్.. తన జీవితాన్ని గ్రామీణాభివృద్ధికి అంకితం చేశారు. ఆయన అంత్యక్రియలు పస్తాపూర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు జరుగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. ఉద్రిక్తత