Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌_రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:35 IST)
డ్రగ్స్ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరన వైట్ చాలెంజ్ తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజేసింది. రేవంత్ ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు విసిరారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణ నెలకొంది. 
 
రేవంత్ ఇంటిని ముట్టించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా.. కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధంయ ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.  
 
మరోవైపు రేవంత్, కేటీఆర్‌ మధ్య మొదలైన డ్రగ్స్ రగడ కొనసాగుతోంది. కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాలు విసిరిన రేవంత్‌రెడ్డి… తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ గన్‌పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో అమరుల స్ధూపాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేశారు. 
 
రేవంత్ ధర్నాతో గన్ పార్క్ అపవిత్రమైందని నిరసన వ్యక్తం చేశారు. అమరవీరుల స్ధూపాన్ని పాలతో కడిగారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments