Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరగుతుంటే.. టి. సర్కారు నిద్రపోతుందా? హైకోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (11:38 IST)
తెలంగాణలో కరోనా టెస్టులు, ఇంకా కరోనా వైద్యానికి సంబంధించిన వివరాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వివరాలు అధికారులు సరిగా చూపించడంలేదని అన్నారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది.
 
కరోనా వివరాలు తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని.. వివరాలు స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు పేర్కొంది. బెడ్లు, వెంటిలేటర్లు వివరాలు ఎందుకు తెలియజేయటం లేదని ప్రశ్నించింది. ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడింది. కోర్టు ఆదేశాలు పాటించని ఆదేశాలు పాటించని వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. 
 
న్యాయస్థానం తీర్పులను తెలంగాణ సర్కారు ఒక్కసారి కూడా అమలు చేయడం లేదని మండిపడింది. ఏపీ, ఢిల్లీలతో పోల్చుకుంటే.. కరోనా పరీక్షలు నిర్వహించటంలో తెలంగాణ బాగా వెనకబడిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments