Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం... తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (08:12 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 
 
అల్పపీడనానికి అనుబంధంగా గుజరాత్‌లోని కచ్ వరకు ఉపరిత ద్రోణి ఆవరించిందని, మరోవైపు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. వర్షాలు పడేసమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
 
మరోవైపు, గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్న విషయం తెల్సిందే. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. అనేక లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. 
 
అలాగే, సిరిసిల్ల రాజన్న జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తగ్గాయి. ఫలితంగా వాతావరణం బాగా చల్లబడింది. గాలిలో తేమ పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments