హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:03 IST)
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఫిలింనగర్‌, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

మరోవైపు ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 12, 13 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. రాగల రెండు, మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో  నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు కురిసే వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments