హైదరాబాద్ నగరంలో భారీ వర్షం - ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (13:31 IST)
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలి పురం, కాచిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 
 
మరోవైపు నేడు, రేపు హైదరాబాద్‌ నగరానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
 
వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుందవై ఇంట్లోనే ఉండాలి.. పార్తీబన్ కామెంట్లపై త్రిష ఫైర్.. మైక్ దొరికిందని?

విడుదలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డులు ఎక్కడ?

నిహారిక కొణిదెల‌ నిర్మించిన రాకాస’నుంచి రపప్పా.. రపప్పా.. పాట విడుదల

Guruva Reddy: కమల్ హాసన్, ఎన్టీఆర్, నసీరుద్దీన్ షా ఏదైనా చేయగలరు : గురవ రెడ్డి

Vishal: విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో మొగుడు విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

తర్వాతి కథనం
Show comments