Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (08:30 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొన్నది. ఇది సోమవారం ఉదయం ఉత్తర కోస్తా ఒడిశా వద్ద చాంద్‌బలీకి పశ్చిమ వాయవ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.
 
రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మీదుగా ప్రయాణించి, ఆ తరువాత 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
 
ఇదిలావుంటే, ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. అయితే ఐదు జిల్లాల్లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఈ ఐదు జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 60 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 
 
21 జిల్లాల్లో అధిక వ‌ర్షపాతం (20 నుంచి 50 శాతం మ‌ధ్య‌లో) న‌మోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఏ ఒక్క జిల్లాల్లోనూ వ‌ర్ష‌పాతం లోటు లేదు. జూన్ 5వ తేదీన రాష్ట్రాన్ని నైరుతి రుతుప‌వ‌నాలు తాకాయి. వారం రోజుల ముందే నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రంలో విస్త‌రించాయి. ఇప్ప‌టికీ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
జూన్ 1 నుంచి సెప్టెంబ‌ర్ 12వ తేదీ వ‌ర‌కు 873.9 మి.మీ. వ‌ర్ష‌పాతం (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 650.9 మి.మీ.) న‌మోదైంది. అంటే సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 34 శాతం అధిక‌ వ‌ర్షపాతం న‌మోదైంది. గ‌తేడాది ఇదేస‌మ‌యానికి 863.9 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.
 
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 75 శాతం, నారాయ‌ణ‌పేట‌లో 72 శాతం, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 64 శాతం అధిక‌ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. నాగ‌ర్‌క‌ర్నూల్, సంగారెడ్డి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, సూర్యాపేట‌, ములుగు, పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల జిల్లాలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెంగ్త్ వీడియో ప్లీజ్... “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ నటి ఓవియా రిప్లై

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

ఘనంగా నారా రోహిత్ - సిరి లేళ్ల నిశ్చితార్థం.. హాజరైన సీఎం బాబు దంపతులు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాల్గవ చిత్రం ప్రకటన

చైతన్య రావు, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఆహాలో ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments