Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం - రేపు తెలంగాణాలో వర్షాలు

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (18:21 IST)
బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం నెలకొంది. దీంతో శనివారం తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికను జారీచేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వెస్ట్ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాల్లో కొనసాగుతుంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్తర ఒరిస్సా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. 
 
కాగా, శుక్రవారం ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే, శనివారం ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
జలప్రళయంతో 74 మంది మృత్యువాత  
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన జలప్రళయం సృష్టించింది. ఈ ప్రళయంలో 74 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, ఈ భారీ వర్షాల కారణంగా 10 వేల కోట్ల నష్టం వాటిల్లింది. జూలై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరువకముందే మరోమారు ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్తు కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయాల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
 
అలాగే, గత వారం రోజులుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు వంతెనలు కొట్టుకునిపోయాయి. పలు చోట్ల భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగిపడిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో సుమారు 21 మంది చనిపోయారు. 
 
మరోవైపు, ఈ జలప్రళయంతో రాష్ట్ర టూరిజం పడిపోయింది. సాధారణంగా కొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏటా పర్యాటకులు పోటెత్తేవారు. ఈ వర్ష ప్రభావంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు గతంలో రోజుకు రూ.2 వేలు సంపాదించేవారు. ఇప్పుడు రోజుకు రూ.200 రావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 50 నుంచి 60 శాతంగా ఉన్న హోటల్‌ ఆక్యుపెన్సీ.. ప్రస్తుతం 5 శాతానికి పడిపోయిందంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments