Webdunia - Bharat's app for daily news and videos

Install App

హయ్యో మంత్రిగారు!.. స్వగ్రామానికే నీళ్లు తెచ్చుకోలేకపోయారు మరి

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (06:30 IST)
అధికారుల అలసత్వం వల్ల మిషన్ భగీరథ పథకం కింద రావాల్సిన నీళ్లు... ఇప్పటికీ తన సొంత గ్రామానికి రావట్లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేసి ఇంటింటికీ నీళ్లందించాలని సూచించారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ అధికారుల అలసత్వంతో... తన సొంత గ్రామానికే భగీరథ నీళ్లు రావడం లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మిషన్‌ భగీరథ ప‌నుల పురోగ‌తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని... ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి త్వరలోనే ఇంటింటికీ నీళ్లందించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా ఇంటి నల్లా కనెక్షన్‌లు చేపట్టకపోవడం వల్లే నీళ్లు అందించలేకపోతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు వివరించారు.

క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలతో వేగంగా పని చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, విఠ‌ల్ రెడ్డి, రాఠోడ్ బాపురావు, రేఖాయాక్‌, నిర్మల్‌ జ‌డ్పీ ఛైర్ ప‌ర్సన్ విజ‌య‌ల‌క్ష్మి, ఆదిలాబాద్ జ‌డ్పీ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌లు దివ్యాదేవరాజన్‌, ఎం.ప్రశాంతి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments