Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Halo Sun భాగ్యనగరంలో ఇంద్ర ధనుస్సు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (13:48 IST)
Rainbow
భాగ్యనగరంలో ఇంద్ర ధనుస్సు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో భాగ్యనగరంలో బుధవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. 
 
హాలో సన్‌ అంటూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంధ్రధనుసు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిపిసోతున్నారు. గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచిక అంటారు.
 
ఇదిలా ఉంటే, సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని "22-డిగ్రీ హలోస్" అని పిలుస్తారని తెలిపారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments