Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (10:38 IST)
గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల మొదటి సమావేశం ప్రారంభమవుతుంది.

ముందు గా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యా హ్నం 12:30 గంటలకు తొలుత మేయర్‌ ఎన్నిక, అనంతరం డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఏ కారణంగానైనా ఎన్నిక నిలిచిపోతే.. మరుసటి రోజు సమావేశం నిర్వహించి ఎన్నుకుంటారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లలో ఒకరు ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) కమిషనర్‌ సి.పార్థసారథి శుక్రవారం నోటిపికేషన్‌ జారీ చేశారు.

మొదటి సమావేశం, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల షెడ్యూల్‌పై ఫిబ్రవరి 6లోగా నూతన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments