Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూ లెట్ బోర్డు పెడితో బాదుడే : షాకిస్తున్న జీహెచ్ఎంసీ

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (08:32 IST)
భాగ్యనగరి వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తేరుకోలని షాకిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టు లెట్ బోర్డులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక చేసింది. తమ హెచ్చరికలను బేఖాతర్ చేస్తే వారిపై షాకిచ్చేలా జీహెచ్ఎంసీ కార్యరంగంలోకి దిగింది. తాజాగా మూసాపేట డివిజన్ పరిధిలో ఓ దుకాణ యజమానికి రూ.2 వేల జరిమానా విధించింది.
 
మోతీనగర్ పరిధిలోని పాండురంగ నగర్ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్యగౌడ్ దుకాణం కోసం ఓ గదిని అద్దెకు ఇచ్చేందుకు ‘టు లెట్’ బోర్డు తగిలించారు. దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్ రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ-చలానా ద్వారా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
 
కాగా, టు లెట్ బోర్డులపై జరిమానా విధించనున్నట్టు జీహెచ్ఎంసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా టులెట్ బోర్డులు, పోస్టర్లు ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో జనంలో గందరగోళం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments