గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల మ్యాన్‌హోల్‌లో గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని అపుడే వెలికి తీశారు. గల్లంతైన మరో మృతదేహం కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలించాయి. ఈ గాలింపు చర్యల ఫలితంగా కార్మికుడు అంతయ్య గల్లంతైన ఆరు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు.
ఆరు రోజుల తర్వాత ఆయన మృతదేహం బయటపడింది. మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆరు రోజులుగా కొనసాగిస్తోన్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఆరు రోజుల పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.
కాగా, ఇటీవల రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మురికి కాలువలోకి దిగాలని కాంట్రాక్టర్ చెప్పడంతో మొదట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుపోయాడు. ఇద్దరూ మృతి చెందారు. దీంతో కాంట్రాక్టర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.