Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ ఎన్నికలు : మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (14:41 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)కి డిసెంబరు నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో అభ్యర్థులు, ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలతో పాటు నామినేషన్లు, ప్రచారపర్వానికి సంబంధించిన అంశాలపై అందులో స్పష్టం చేసింది. 
 
జీహెచ్​ఎంసీ యాక్టును అనుసరిస్తూ గతం మాదిరిగానే ఈసారి కూడా జనరల్​ కేటగిరీలోని అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 డిపాజిట్ ​సొమ్ముగా నిర్ధారించింది. నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. 
 
ప్రతిపాదిత, బలపర్చే అభ్యర్థులు స్థానికంగా ఉన్న వార్డులకు చెందినవారు కావాలని, వార్డుల జాబితాలో ఓటు హక్కు ఉన్నవారే ప్రతిపాదించాల్సి ఉంటుందని పేర్కొంది. గ్రేటర్​లో ఓటు హక్కు ఉన్న వారు ఏ వార్డుల్లోనైనా పోటీ చేసేందుకు అర్హులని తెలిపింది. 
 
అంతేకాకుండా, జనవరిలో నిర్వహించిన కొంపల్లి మున్సిపల్​ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఫేస్​ రికగ్నైజ్​ పోలింగ్​ను చేపట్టి 80 శాతం సక్సెస్​ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు గ్రేటర్​ ఎన్నికల్లో ప్రతి వార్డులోని ఒక పోలింగ్​ కేంద్రంలో ఫేస్​ రికగ్నైజ్​ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 
 
ముఖ్యంగా, పాతబస్తీ పోలింగ్​ కేంద్రాల్లో ఈ విధానాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటరు జాబితా, పోలింగ్​ కేంద్రాల ముసాయిదా నేపథ్యంలో గ్రేటర్​ అధికారులు ఫేస్​ రికగ్నైజ్​ సెంటర్​ ఏర్పాటు చేసే జాబితాను సిద్ధం చేస్తున్నారు. 
 
ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సామగ్రి, ఇంటర్నెట్​ ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సోమవారం నాటికి ఈ కేంద్రాలు ఖరారు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పాతబస్తీలో ఈ కేంద్రాల ఏర్పాటును వద్దని కోరుతూ ఇప్పటికే ఎంఐఎం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 
 
దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని వార్డుల్లో ఒక్క సెంటర్​లో ఫేస్​ రికగ్నైజ్​ ఏర్పాటు చేస్తుండగా పాతబస్తీ పరిధిలోని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని, అభ్యంతరం వ్యక్తం చేసే ఓటర్లకు మినహాయింపు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments