Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫర్హానాను నయీమ్ ముద్దుగా 'కోకోనట్' పేరుతో పిలుపు... నువ్వు 'కోకోనట్ అయితే మిగిలినవారూ...

కోకోనట్ అంటే తెలియనివారు ఉండరు కదా. కొబ్బరి బొండాం కావచ్చు లేదా కొబ్బరికాయ కావచ్చు. ఐతే ఈ కాయ పేరును నయీమ్ తన భార్యగా చెప్పుకుంటున్న ఫర్హానాకు పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆమె పేరుపై గోవాలో 2014లో రూ. 1,00,00,000తో ఓ మోడ్రన్ గెస్ట్ హౌసును కొనుగోలు చేశా

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (17:41 IST)
కోకోనట్ అంటే తెలియనివారు ఉండరు కదా. కొబ్బరి బొండాం కావచ్చు లేదా కొబ్బరికాయ కావచ్చు. ఐతే ఈ కాయ పేరును నయీమ్ తన భార్యగా చెప్పుకుంటున్న ఫర్హానాకు పెట్టుకున్నాడు. అంతేకాదు.. ఆమె పేరుపై గోవాలో 2014లో రూ. 1,00,00,000తో ఓ మోడ్రన్ గెస్ట్ హౌసును కొనుగోలు చేశాడు. కోకోనట్(పర్హానా) అక్కడి వ్యవహారాలన్నీ చూసుకునేది. దీనితో నయీమ్ మాఫియా గోవా వరకూ వ్యాపించిందని పోలీసులు కనుగొన్నారు. గోవాలో అతడి మాఫియా ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునేందుకు ఫర్హానా(కోకోనట్) వద్ద విచారణ చేస్తున్నారు.
 
మరోవైపు నయీమ్ తన డైరీలో చాలామంది పేర్లను కోడ్ భాషలోనే రాసుకున్నాడు. అందులో కోకోనట్ లాగానే కొన్ని పండ్లు, పానీయాల పేర్లను పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కోడ్ భాషలో ఉన్న పేర్లు ఎవరెవరివో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇంకోవైపు నయీమ్ నేర ప్రపంచానికి బాసటగా ఓ మాజీ డీజిపి హ్యాండ్ ఇచ్చాడనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ హోంమంత్రి స్వయంగా ఆ మాజీ డిజీపీ, మాజీమంత్రి పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పడంతో నయీమ్ కేసు రాజకీయంగా, పోలీసు వ్యవస్థలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments