Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరిక తీర్చుతావా లేక నీ కొడుకు, భర్తను చంపేయమంటావా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (10:18 IST)
తన కోర్కె తీర్చాలనీ, లేదంటే కొడుకును, భర్తను అంతం చేస్తానంటూ ఓ కామాంధుడు వివాహితను వేధింపులకు గురి చేసాడు. ఆమెను అనునిత్యం వెంబడించేందుకు కారులో జిపిఎస్ కూడా అమర్చాడు. చివరికి అతడి వేధింపులు తాళలేక భర్తకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెం.1లో నివాసముంటున్న 36 ఏళ్ల వివాహిత ఓ బ్యూటీ సెంటర్లో మెడికల్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. చికిత్స కోసం ఇటీవల వరప్రసాద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడితో పాటు విశ్వనాథ్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఐతే చికిత్స చేస్తున్న వివాహితపై కన్నేశాడు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తనతో స్నేహం చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.
 
అతడి వేధింపులు తాళలేక అతడి ఫోను నెంబరును బ్లాక్ లిస్టులో పెట్టేసింది. దీనితో ఆమె ఇంటి చిరునామాను తెలుసుకుని ఏకంగా ఆమె నివాసం వుంటున్న పక్క ప్లాటులో అద్దెకి దిగాడు. ఆమె కుమారుడు ఆడుకునేందుకు బయటకు తిరుగుతున్నప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. అలా ఓ రోజు ఆమె భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి తన కోర్కె తీర్చకపోతే బిడ్డను, భర్తను చంపేస్తానని బెదిరించాడు.
 
ఆమె ఎటు వెళ్తుందో తెలుసుకునేందుకు కారులో జిపిఎస్ కూడా అమర్చాడు. కాగా ఆ కామాంధుడి నుంచి వేధింపులు అధికం కావడంతో విషయాన్ని భర్తకు చెప్పేసింది. దీనితో అతడు వుంటున్న ప్లాట్ వద్దకు వెళ్లి చూస్తే అప్పటికే పరారయ్యాడు. ఓ రాజకీయ నాయకుడిని ఆశ్రయించి అక్కడి నుంచి బెదిరింపు కాల్స్ చేశారు. కేసు పెట్టవద్దనీ, రాజీ కుదుర్చుకోవాలంటూ హెచ్చరించారు. అలా చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటూ భయపెట్టారు. ఐతే బాధితులు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments