Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మాతృదినోత్సవం - అమ్మలకు ఆర్టీసీ అదిరిపోయే బహుమతి

Webdunia
ఆదివారం, 8 మే 2022 (10:18 IST)
ప్రతియేటా మే 8వ తేదీన అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని అమ్మలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అదిరిపోయే బహుమతి ఇచ్చింది. ఈ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని 8వ తేదీ ఆదివారంనాడు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. 
 
ఐదేండ్లలోపు చిన్నా‌రు‌లతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆది‌వారం ఉచి‌తంగా ప్రయా‌ణిం‌చ‌వ‌చ్చని సంస్థ ఎండీ సజ్జనార్‌ ప్రక‌టించారు. అమ్మ అను‌రా‌గాన్ని, ప్రేమను వెల‌క‌ట్టలే‌మని, ఆ త్యాగ‌మూ‌ర్తుల విశిష్ట సేవ‌లను గుర్తుచేసు‌కుంటూ ఈ నిర్ణయం తీసు‌కు‌న్నా‌మని వెల్లడించారు. మదర్స్‌ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. 
 
కాగా, ప్రత్యేక సమయాల్లో ఆర్టీసీ రాయితీలు క‌ల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్‌లలో 20 శాతం రాయితీ అందిస్తున్నారు. అలాగే మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా టిక్కెట్ల రేటు పెంపు 10 రోజులు చాలు : సర్కారుకు హైకోర్టు

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments