కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. పార్టీలో సంస్థాగత సమస్యలను గుర్తించే నాయకత్వం అవసరమని, అందువల్ల పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి గత రెండు వారాలుగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. అదేసమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. కానీ అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక హోదాను ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాలను రూపొందించే సాధికారిక బృందంలో ఒక సభ్యుడిగా మాత్రమే ఉండాలన్న ప్రతిపాదనను చేయగా, దాన్ని ప్రశాంత్ కిషోర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకంటే బాగా పార్టీలో సంస్థాగత సమస్యలు గుర్తించే వారికి పగ్గాలు అప్పగించాలని సూచించారు.