కన్నతండ్రి కాదు.. కసాయి తండ్రి.. కుమార్తెల గొంతు కోశాడు..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (14:56 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు తండ్రి. దీన్ని గమనించిన స్థానికులు.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించి.. ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఎండీ మహమ్మద్ 15 సంవత్సరాల క్రితం మిర్‌దొడ్డి మండలంలోని మోతే గ్రామానికి వలసొచ్చాడు. మోతే గ్రామంలో మాంసం విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. 
 
అయితే శుక్రవారం రోజు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గుంజేడు సాయిలు ఇంట్లో మహమ్మద్ అద్దెకు దిగాడు. శనివారం ఉదయమే పీకల దాకా మద్యం సేవించిన మహమ్మద్‌.. ఆ మత్తులో తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లో బంధించి.. చంపేస్తానని బెదిరించాడు. 
 
విషయం తెలుసుకున్న స్థానికులు భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పిల్లలను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments