Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలితో వివాహేతర సంబంధం, హైదరాబాదు శివారులో యువకుడు దారుణ హత్య

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:28 IST)
భార్య సోదరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేసారు. హైదరాబాదు శివారులోని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
 
పోలీసుల కథనం ప్రకారం ముషీరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మునాఫర్ ఖాద్రి (27) చాంద్రాయణగుట్ట డివిజన్ హఫీజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప, నెలరోజుల బిడ్డ ఉన్నారు. తన అక్క బాలింత కావడంతో ఆమె సోదరి ఇక్కడికి వచ్చింది. ఇదే అదనుగా మునాఫర్ ఆమెపై కన్నేశాడు.
 
ఆమెను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని సయ్యద్ భార్య సోదరిని తీసుకుని ఇంటి నుండి వెళ్లి పోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ తన సంబంధాన్ని మాత్రం విడిచి పెట్టలేదు. దీంతో మాట్లాడుకుందాం రమ్మంటూ యువతి తండ్రి, తమ్ముడు అతడిని ఇంటికి పిలిపించారు.
 
ఈ సంబంధం మంచిది కాదని ఖాద్రీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఖాద్రిని పట్టుకుని కాళ్లు చేతులు కట్టేశారు. అనంతరం నడి రోడ్డుపైకి ఈడ్చుకొని వచ్చి మాంసం కోసే కత్తితో గొంతుకోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments