Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:45 IST)
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24 వరకు పొడిగించారు.

ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకోగా తాజా పొడిగింపుతో మిగిలిపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. 

ఇప్పటికే జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రన్స్ టెస్టులను ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు ఎంట్రన్స్ సెట్స్ లో మూడు సెట్స్ తేదీల్లో మార్పు ఉంటుందని, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 

ఈ పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు పొడిగింపు వల్ల వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకనే అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments