Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటలకు స్వల్ప అస్వస్థత - 'ప్రజా దీవెన యాత్రకు బ్రేక్'

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (18:43 IST)
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 
 
ఈ యాత్రలో భాగంగా, ఆయన కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాదయాత్ర కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు.
 
ఈటెల రాజేందర్ ప్రస్తుతం జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన శనివారం మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారని వెల్లడించారు.
 
కాగా ఈటెలకు వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారని తెలుస్తోంది. కాగా తన భర్త జ్వరం బారిన పడడంతో ఆయన బదులు ఈటెల సతీమణి జమున పాదయాత్రను కొనసాగించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments