ఈటల పాదయాత్ర : 23 రోజులు 270 కిలోమీటర్లు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (11:13 IST)
ఇటీవల కాషాయం కండువా కప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో సోమవారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఆయన శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాత్రికి అంబ‌ల గ్రామంలో బ‌స చేయనున్నారు. మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర జరగనుంది.
 
కాగా, ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన హుజురాబాద్ స్థానానికి జరిగే ఉపఎన్నికలను అటు తెరాస, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments