తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఎన్‌కౌంటర్ - ఆరుగురు నక్సల్స్ హతం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:05 IST)
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు భారీ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నాపురం సమీపంలోని సుక్మా - బీజాపూర్ జిల్లాల అటవీ ప్రాంతంలో జరిగింది. 
 
ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచారం ఉన్నట్టు వచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులతో కలిస్ గ్రేహోండ్స్ దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరపడంతో గ్రేహోండ్స్ దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ మధ్యకాలంలో కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. దీంతో గ్రేహోండ్స్ దళాలు మావోల కోసం ముమ్మరంగా గాలిస్తూ వచ్చాయి. అలాగే, ప్రత్యేకంగా నిఘా సారించారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ గాలింపు చర్యలు చేపట్టగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments