Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు : రేవంత్ రెడ్డిపై ఈడీ చార్జిషీట్

Webdunia
గురువారం, 27 మే 2021 (16:20 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. కొన్నేళ్ళ తర్వాత ఈ కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. 
 
2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ అభియోగాలు మోపింది.
 
అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.
 
ఈ క్రమంలో ఈ కేసులో గురువారం ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ... చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 
 
అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments