Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం : రూ.20 కోట్ల హెరాయిన్ పట్టివేత

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (14:48 IST)
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం భారీగా డ్రగ్స్‎ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్‎ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుంచి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్స్‎ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో ఈ విమానాశ్రయంలో డ్రగ్స్‌ను భారీగా స్వాధీనం చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే, హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు.. సినీ ఇండస్ట్రీలో అనేకమంది డ్రగ్స్ బానిసలైనట్టు వార్తలు వస్తున్నాయి. వీరికి సరఫరా చేసేందుకే భారీ మొత్తంలో డ్రగ్స్‌ను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, గతంలోనూ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం జరిగిన ఘటనలు ఉన్నాయి. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ పట్టివేతపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
కాగా స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగు చూసింది. 
 
ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఆహార సామగ్రిలో పేరుతో డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. కిలోకుపైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలతో కలిపి తీసుకునే మాదక ద్రవ్యంగా దీన్ని గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో పలు శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments