Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. ఇనుప చువ్వులతో అక్కడ వాతలు పెట్టిన భర్త...

Webdunia
బుధవారం, 8 మే 2019 (21:06 IST)
భార్యపై అనుమానంతో ఉన్మాదిలా మారిపోయాడో భర్త. పరాయి వ్యక్తులతో తన భార్య మాట్లాడుతోందన్న అనుమానంతో ఇనుప చువ్వులతో భార్య ఒళ్లంతా వాతలు పెట్టాడు. కంట్లో కారం కొట్టి చిత్ర హింసలకు గురిచేశాడు. అన్నదమ్ముళ్ళ సాయంతో తాళ్ళతో బంధించాడు. వాళ్లందరూ కలిసి ఏకంగా ఆరుగంటల పాటు హింసించారు. సూర్యాపేట జిల్లా యలకారం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
 
యల్కారం గ్రామానికి చెందిన రామలింగయ్యకు ఐదేళ్ల క్రితం గౌతమితో పెళ్ళయ్యింది. కొద్దికాలం కాపురం సాఫీగానే సాగింది. అయితే రామలింగయ్యకు అనుమానం జబ్బు సోకింది. దీంతో గౌతమిని తరచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. వాళ్లిద్దరి మధ్య గొడవలు పెద్ద మనుషుల వరకు వెళ్ళాయి. పంచాయితీ పెట్టిన పెద్దమనుషులు నచ్చజెప్పడంతో గౌతమి సర్దుకుపోతూ వచ్చింది.
 
అయితే మంగళవారం నాడు భర్త ఉన్మాదం పతాకస్థాయికి చేరింది. పరాయి వ్యక్తులతో మాట్లాడుతోందన్న నెపంతో సోదరులు నర్సయ్య, ముత్తయ్యలతో కలిసి గౌతమి చిత్రహింసలకు గురిచేశాడు. ఆరుగంటల పాటు నరకం చూపించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments