Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు బాగుపడటం మీకు ఇష్టంలేదా?: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Webdunia
సోమవారం, 26 జులై 2021 (20:43 IST)
తెలంగాణ రైతులు కష్టాల నుంచి బయటపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇష్టం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాసారు.
 
ఆరుగాలం శ్రమించే అన్నదాతలను ఆదుకోవడంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, విత్తనాలు, ఎరువులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
అసలు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించారు. ఈ పథకాలు అమలుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. పంటలు వేసేందుకు వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయనీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments