కాంగ్రెస్‌ కు వెన్నుపోటు పొడవకండి: మధుయాస్కీ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:00 IST)
"కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు.. కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడవకండి" అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే అన్నారు.

వైఎస్‌ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. అది రాజకీయ సమ్మేళనం అని విమర్శించారు. ఆ సమ్మేళనానికి వెళ్లొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా కొంతమంది హాజరయ్యారన్నారు.

ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం ద్వారా పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా?, వద్దా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

వైఎస్సార్‌ బతికుంటే తెలంగాణ ఏర్పడేదే కాదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఇచ్చిన వినతులు విభజన చట్టంలోనే ఉన్నాయని.. వాటిని ఏడేళ్లు ఎందుకు మర్చిపోయారని మధుయాస్కీగౌడ్‌ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments