Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకున్న వైద్యుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (20:42 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వైద్యుడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకోవడంతో డాక్టర్ మజారుద్దీన్ చనిపోయాడు. ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, డాక్టర్ మజారుద్దీన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో నివసిస్తున్నారు. ఆయన పాయింట్ బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మజారుద్దీన్‌ను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోస్టుమార్టం నిమిత్తం డాక్టర్ మజారుద్దీన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వియ్యంకుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments