Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపేశారుగా నాకు ఇల్లు రూ.15 లక్షలివ్వండి: చెన్నకేశవుల భార్య

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:18 IST)
దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య తరువాత నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దీనితో కొంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టాలున్నాయి... ఆ చట్టాలు చూసుకుంటాయి కానీ ఇలా అతి దారుణంగా చంపేయడం ఏమిటని ప్రశ్నించారు నిందితుల కుటుంబ సభ్యులు. ఇదంతా జరుగుతుండగా మానవ హక్కుల కమిషన్ రావడం ఈ వ్యవహారంపై ఆరా తీయడం కూడా జరిగిపోయాయి. 
 
అయితే తాజాగా దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక చెప్పిన మాటలు చర్చకు దారితీసింది. రేణుక ఇప్పుడు గర్భిణి. నా భర్తను చంపేశారు. సరే.. నాకు ఇప్పుడు దిక్కెవరు. నాకు 15 లక్షల రూపాయల డబ్బులు, డబుల్ బెడ్ రూం ఫ్లాం ఇవ్వండి.. నేను బతకాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వాన్ని రేణుక నిలదీస్తోంది. బతుకుతెరువు భారమవుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటోంది రేణుక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments