Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పుకున్న దేత్తడి హారిక...

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (11:59 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి పాపులర్ అయిన దేత్తడి హారిక ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. 
 
ఈ నెల 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా హారిక నియమితులయ్యారు. ఈ విషయం బయటకి పొక్కిన తర్వాత వివాదమైంది. పైగా, ఈ నియామకం రోజుకో మలుపు తిరుగుతోంది.
 
టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ మహిళా దినోత్సవం రోజే ఇచ్చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు శాఖ మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కార్పొరేషన్‌ చైర్మన్‌పై సీరియస్ అయినట్లు సమాచారం. 
 
అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారమూ లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై విచారించి వేరొకరిని నియమిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హారిక బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments