Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సియట్ ప్రచారకర్తగా రానా దగ్గుబాటితో ఒప్పందం: మేకులపై నడిపినా పంక్చర్ పడదట

Advertiesment
సియట్ ప్రచారకర్తగా రానా దగ్గుబాటితో ఒప్పందం: మేకులపై నడిపినా పంక్చర్ పడదట
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (16:52 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ టైర్‌ తయారీదారు, సియట్‌ టైర్స్‌ తమ ‘పంక్చర్‌ సేఫ్‌’ శ్రేణి బైక్‌ టైర్లను విభిన్నమైన మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కోసం బాలీవుడ్‌ స్టార్‌ రానా దగ్గుబాటితో ఒప్పందం చేసుకుంది. తమ సమగ్రమైన మార్కెటింగ్‌ ప్రచారంలో భాగంగా పంక్చర్‌ సేఫ్‌ టైర్ల కోసం రూపొందించిన నూతన వాణిజ్య ప్రకటనలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. దీనిని ఐదు దక్షిణ భారత రాష్ట్రాలలో టీవీ, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నారు. ఈ నూతన వాణిజ్య ప్రకటనను ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ అంతటా ప్రసారం చేయనున్నారు.
 
ఈ ప్రచారాన్ని ‘సియెట్‌ పంక్చర్‌ సేఫ్‌ సీలెంట్‌ టెక్నాలజీ’ నేపథ్యం ఆధారంగా తీర్చిదిద్దారు. అత్యంత కఠినమైన రోడ్లపై సవారీ చేసినప్పటికీ భద్రత మరియు సౌకర్యం ఈ టైర్లు అందిస్తాయని దీని ద్వారా తెలియజేయనున్నారు. ఓ అండ్‌ ఎం సృష్టించిన ఈ వాణిజ్య ప్రకటనను అత్యంత ఆసక్తికరమైన కథనంతో రూపొందించారు. దీనిలో ‘కీల్‌ వాలే బాబా’గా రానా దగ్గుబాటి మేకులతో కూడిన పరుపుపై కనిపిస్తారు.
 
కొంతమంది భక్తుల కోరిక మేరకు ఓ గ్రామాన్ని సందర్శించిన బాబా, తన ఆశ్రమం నుంచి పంక్చర్లు పడతాయన్న భయం లేకుండా మేకులతో కూడిన రహదారిపై ప్రయాణిస్తారు. ఇది ఈ పంక్చర్‌ సేఫ్‌ టైర్లలో అత్యంత ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తుంది. అత్యంత కష్టమైన భూభాగాలలో సైతం ఎలాంటి ఇబ్బందులూ లేని సవారీ సౌకర్యం తీసుకువస్తుందనే అంశాన్ని ప్రచారం చేయాలన్నది సియట్‌ నుంచి వచ్చిన ఈ సృజనాత్మక ప్రచారం వెనుక ఉన్న ఆలోచన.
 
శ్రీ అర్నబ్‌ బెనర్జీ, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, సియట్‌ టైర్స్‌ మాట్లాడుతూ, ‘‘సియట్‌ వద్ద మేమెప్పుడూ కూడా ‘ప్రతి రోజూ ప్రయాణాన్ని సురక్షితంగా మరియు మృదువుగా మలచాలి’ అనే మా లక్ష్యాన్ని నమ్ముతుంటాం. మేము నూతనంగా విడుదల చేసిన ఈ ప్రచారం దానినే మోటార్‌సైకిల్స్‌ కోసం వెల్లడిస్తుంది. ఎలాంటి భూభాగాలలో అయినా అవరోధాలను నిరోధించుకునేందుకు మన్నికైన టైర్లను వినియోగించాల్సిన ఆవశ్యకతను వెల్లడించాలన్నది ఈ ప్రచార ముఖ్యోద్దేశం.
 
ఈ ప్రచారం కోసం రానా దగ్గుబాటి మా బోర్డ్‌పైకి రావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆయన సియట్‌ యొక్క పంక్చర్‌ సేఫ్‌ సాంకేతికత యొక్క శక్తి, మన్నికను సంపూర్ణంగా ఉదహరించనున్నారు. మా వినియోగదారులను చేరుకునేందుకు అత్యధిక వ్యూవర్‌షిప్‌తో భారతదేశంలో ఎక్కువ మంది చూడటానికి ఇష్టపడే ఇండియా-ఇంగ్లాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ మాకు అనువైన అవకాశాన్ని అందించింది..’’ అని అన్నారు.
 
భారతీయ నటుడు శ్రీ రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అత్యంత గౌరవనీయ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన సియట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. కీల్‌ వాలే బాబాగా దీనిలో చేయడం ఓ వినూత్నమైన అనుభూతిని అందించింది మరియు నేను ఈ షూటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. సియట్‌ టైర్స్‌తో ఉత్సాహపూరితమైన ప్రయాణానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.
 
శ్రీ రోహిత్‌ దూబే, గ్రూప్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌, ఓ అండ్‌ ఎం మాట్లాడుతూ, ‘‘సియట్‌ బ్రాండ్‌కు ప్రత్యేకమైన సృజనాత్మక భాగస్వాములుగా, టైర్‌ ప్రకటనలకు సంబంధించిన హాక్నీడ్‌ కోడ్స్‌ను అనుసరించకుండా ఉంటూనే సియట్‌ టైర్‌ కమర్షియల్‌ గురించి ఊహించతగిన రీతిలో ఉండాలని కోరుకున్నాం. సియట్‌ యొక్క బ్రాండ్‌ వ్యాప్తిని మరింతగా వృద్ధి చేసే అతి ముఖ్యమైన భూమికను కీల్‌ వాలే బాబా పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో, మేము మేకులు, బాబాలకు సంబంధించి భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రస్తావనలను తవ్వి తీయడంతో పాటుగా వినూత్నమైన పంక్చర్‌ సేఫ్‌ టెక్నాలజీకి దారితీసే అంశాలను అనుసంధానించాము. ఎప్పటిలాగానే, ఎల్లప్పుడూ సానుకూలంగా మరియు ధైర్యవంతంగా ఉండే సియట్‌ మార్కెటింగ్‌ బృందంతో కలిసిపనిచేయడం సంపూర్ణ ఆనందం కలిగించింది’’అని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో మోటార్‌సైకిల్స్‌ కోసం విన్నూతమైన ‘పంక్చర్‌ సేఫ్‌ టైర్స్‌’ను సియట్‌ ఆవిష్కరించింది. ఒకవేళ పంక్చర్‌ అయినప్పటికీ తమంతట తాముగా సీలింగ్‌ చేసుకుని టైరు నుంచి గాలి బయటకు రాకుండా చేస్తాయి. వ్యాసార్థం 2.5 మిల్లీ మీటర్లు వరకూ ఉండే మేకులు చేసే పంక్చర్లను ఈ సాంకేతికత సీల్‌ చేస్తుంది. సియట్‌ తమ అంతర్గతంగా రూపొందించిన పేటెంటెడ్‌ సీలెంట్‌ సాంకేతికత ఆధారంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ సాంకేతికతతో పంక్చర్లు మూసుకుపోవడంతో పాటుగా టైర్‌ జీవితకాలమంతా అది నిలిచి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. స్నేహితుల మాంసాన్ని నూనెలో వేయించుకుని?