దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణాలో గాలులు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:41 IST)
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వ‌ల్ల తెలంగాణాలో గాలులు వీస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. అక్టోబర్‌ 28 దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోకి ఉత్తర, ఈశాన్య దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
 
వాతావరణంలో మార్పుల వల్ల ఈ నెల 29 వరకు రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్‌లో ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. 
 
తెలంగాణా రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, ఖమ్మం పట్టణంలో అత్యధికంగా 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments