బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. ఈ పువ్వులను Clitoria ternatea అంటారు. ఈ టీ రంగుని చాలా మంది తాగేందుకు ఇష్టపడరు. ఈ టీతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే ఈ టీ తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు బ్లూ టీని క్రమం తప్పకుండా తాగడం వల్లన క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.
క్యానర్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. బ్లూ టీ మన మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లు రెగ్యులర్ టీ కాకుండా బ్లూ టీ తాగితే చాలా మంచిదంటున్నారు నిపుణులు అలసట, చికాకుగా ఉన్నప్పుడు బ్లూ తాగితే ఉపశమనం లభిస్తుంది. మళ్లీ నూతనోత్తేజం వస్తుంది.
బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయంలో పిత్తరస ఉత్పత్తికి బ్లూ టీ దోహద పడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు.
బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతేకాదు మంచి నిగారింపు వస్తుంది. బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తలకు రక్తప్రసరణ పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.