Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ - కవితకు షాక్.. అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (15:21 IST)
ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయి ఇటీవలే బెయిలుపై విడుదలైన నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ పరిణామం ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 
 
అప్రూవర్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తికి ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై విడుదలైన విషయం తెల్సిందే. ఆయన అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పెద్ద పెద్ద వ్యక్తులపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు చాలా రోజుగా జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అలాగే, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవిత వ్యక్తిగత ఆడిటర్ అప్రూవర్‌గా మారిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments