కస్టమర్లకు ముద్దులు ఇవ్వాల్సిందే.. మసాజ్ సెంటర్ ఉద్యోగినిపై ఒత్తిడి

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (11:06 IST)
హైదారాబాద్ నగరంలోని ఓ మసాజ్ సెంటరుకు వచ్చే కస్టమర్లకు ముద్దులు పెట్టాలని, వారు కోరినట్టుగా నడుచుకోవాలంటూ మహిళా ఉద్యోగినికి మర్దన సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటరులో నెలకు లక్ష రూపాయల వేతనంతో ఫిట్నెస్ శిక్షకురాలిగా చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ వద్దకు వచ్చే పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలని, అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి ముద్దులివ్వాలని, వారు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments