Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించి విఫమలైన సీపీఎం... తొలి జాబితా రిలీజ్

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (13:33 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలంగాణ సీపీఎం నేతలంతా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా వెల్లడించింది. మొత్తం 14 మంది అభ్యర్థులతో ఆ జాబితాను విడుదల చేయగా, అందులో పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అలాగే, ఈ ఎన్నికల్లో తమకు పట్టున్న 14 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెల్సిందే ఇందులోభాగంగా తొలిసారి 14 మంది అభ్యర్థులతో ఈ జాబితాను వెల్లడించింది. ఆదివారం సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. 
 
సీపీఎం తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, కారం పుల్లయ్య (భద్రాచలం-ఎస్టీ), పిట్టల అర్జున్ (అశ్వారావు పేట-ఎస్టీ), తమ్మినేని వీరభద్రం (పాలేరు), పాలడుగు భాస్కర్ (మధిర - ఎస్సీ), భూక్యా వీరభద్రం (వైరా - ఎస్టీ), ఎర్ర శ్రీకాంత (ఖమ్మం), మాచర్ల భారతి (సత్తుపల్లి 0 ఎస్సీ), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), చిన వెంకులు (నకిరేకల్-ఎస్సీ), కొండమడుగు నర్సింహా (భువనగిరి), మోకు కనకారెడ్డి (జనగామ), పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం), జె.మల్లికార్జున (పటాన్‌చెరు), ఎం.దశరథ్ (ముషీరాబాద్). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments