Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కు చేసిన కారు తీయమన్న మహిళపై చేయి చేసుకున్న కార్పొరేటర్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:04 IST)
హైదరాబాద్ ఇంటి ముందు పార్కు చేసిన కారు తీయమన్నందుకు ఓ కార్పొరేటర్ మహిళపై చెయ్యి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జీహెచ్ఎంసి కార్పొరేటర్ తన ఇంటి పక్కన ఉండే మహిళపై, ఆమె కుటుంబసభ్యుల ముందే దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
 
జీహెచ్ఎంసి శేరిలింగంపల్లికి చెందిన కార్పొరేటర్ నల్లగండ్లలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. కాగా వీరి ఇంటి పక్కనే ఉంటున్న కుటుంబంతో సదరు కార్పొరేటర్‌కు శనివారం రాత్రి వివాదం జరిగింది. తమ ఇంటికి ఎదురుగా పార్కు చేసిన కారును తీయమని అడిగినందుకు సదరు కార్పొరేటర్ ఆవేశంతో మహిళపై దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు.
 
వీడియోలో కార్పొరేటర్ మహిళ మీద దాడి చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో శేరిలింగంపల్లితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments