Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ కేర్ సెంటర్... వేడినీళ్లు ఇచ్చాడు.. మహిళపై అత్యాచారం.. పాపను చంపేస్తానని..?

కోవిడ్ కేర్ సెంటర్... వేడినీళ్లు ఇచ్చాడు.. మహిళపై అత్యాచారం.. పాపను చంపేస్తానని..?
, ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (15:39 IST)
కోవిడ్ కేర్ సెంటర్లో మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. థానేలో 20 ఏళ్ల యువతి తనను 27 ఏళ్ల అటెంటెండ్ రెండోసారి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

జూన్‌లో ఒకసారి యువతిపై అత్యాచారం జరిగినా బెదిరింపులకు పాల్పడటంతో జడుసుకుని ఇన్నాళ్లూ వుండిపోయిందని.. రెండోసారి కూడా అత్యాచారానికి పాల్పడటం.. తరచూ వేధింపులకు గురిచేయడంతో నవఘర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కరోనా కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న 11 ఏళ్ల బంధువును పరామర్శించేందుకు అక్కడికి వెళ్లింది. ఆ యువతి తనతోపాటూ... తన 10 నెలల పసికందును కూడా అక్కడకు తీసుకెళ్లింది. యువతిపై కన్నేసిన కోవిడ్ కేర్ అటెండెంట్... ఎలాగైనా ఆమెను లొంగ దీసుకోవాలని యత్నించాడు. రకరకాలుగా ప్రయత్నించాడు. అవేవీ ఫలించలేదు. చివరకు మత్తు మందు కలిపిన గోరువెచ్చటి నీరు ఇచ్చాడు. తాగమన్నాడు. ఆమె వద్దనడంతో పసిపాపను ఓ గదిలోకి తీసుకుపోయాడు. పాప కోసం ఆమె కూడా గదిలోకి వెళ్లింది. అరిస్తే పాప పీక నొక్కి చంపుతానని బెదిరించాడు. 
 
ఆల్రెడీ మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. తన పాపను ఇవ్వమని వేడుకుంది. తలుపులు మూసేసిన అటెండెంట్... ఆమెను అత్యాచారానికి చేశాడు. ఇలా ఒకసారి కాదు... మూడుసార్లు రేప్ చేసినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. ఘటన తర్వాత పాపను తీసుకొని ఇంటికి వెళ్లిన ఆమె విషయం ఎవరికీ చెప్పలేదు. బయట చెప్తే.. పాపను చంపేస్తానని బెదిరించాడు.
 
దాంతో ఇన్నాళ్లూ సైలెంటైపోయిన ఆమె... ఈమధ్య ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ ఇచ్చింది. మొత్తానికి మూడు నెలల కిందటి దారుణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ కామాంధుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు.. 11మంది మృతి