Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంటార్కిటికాలో కోవిడ్‌కు చెక్.. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే..?

Advertiesment
అంటార్కిటికాలో కోవిడ్‌కు చెక్.. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే..?
, ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (11:41 IST)
కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. అయితే అంటార్కిటికాలో మాత్రం కొవిడ్‌ రహిత పరిస్థితులను కొనసాగాయి. కరోనా వ్యాప్తికి ముందు అంటార్కిటికాకు చేరుకున్న వారంతా కొన్ని నెలలపాటు చీకట్లోనే గడిపి, శుక్రవారం సూర్య కిరణాలను చూశారు. 
 
కరోనాకు ముందు రోజుల్లో ప్రపంచంలోని అందరూ వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తుంటే.. అంటార్కిటికాలో ఉండేవారు మాత్రం సుదీర్ఘ ఐసొలేషన్, ఆత్మవిశ్వాసం, మానసిక ఒత్తిడితో బతకాల్సివచ్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయని అక్కడి శాస్త్రవేత్తలు వాపోతున్నారు. అక్కడ కరోనా జాడ లేకపోవడంతో తాము ఎప్పటిలాగే ఉండగులుగుతున్నామని టేలర్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. 
 
కోవిడ్‌ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై తమకు ఇంకా పూర్తి అవగాహన లేదన్నారు. అయితే కొద్ది రోజుల్లో అక్కడికి వచ్చే శాస్త్రవేత్తల బృందం నుంచి తాము ఆ విషయాలు నేర్చుకుంటామని వారు తెలిపారు. అయితే అంటార్కిటికాలో కోవిడ్‌ సంబంధిత వైద్య సేవలు అందించడం మిగతా ప్రదేశాలతో పోలిస్తే చాలా కష్టం. పైగా ఇలాంటి ప్రదేశాల్లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. 
 
అక్కడికి చేరడానికి పరిమిత ఆకాశ, సముద్ర మార్గాలున్నాయి. ఈ నేపథ్యంలో నౌకల ద్వారా వచ్చే వారు, అంతకుముందే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దగ్గరగా రాకూడదని పేర్కొంటూ అంటార్కిటికా జాతీయ కార్యక్రమాల నిర్వాహకుల మండలి(సీవోఎంఎన్‌ఏపీ) పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
అంటార్కిటికాలోకి వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకోవడానికి అవసరమైన జాగ్రత్తలన్నిటినీ తీసుకుంటామని సీవోఎంఎన్‌ఏపీ పేర్కొంది. అక్కడికి చేరుకోవాల్సిన బృందాలు క్వారంటైన్‌ ముగించుకొని ఆగస్టు ప్రారంభంలోనే బయలుదేరాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా వారి ప్రయాణం కొన్ని వారాలపాటు ఆలస్యమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ మార్గదర్శకాలు.. మాస్కులను చెత్తబుట్టలో పడేసి...?