Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ మీట్‌కెళ్లి అంటించుకున్నాడు.. ఇంటికొచ్చి 46 మందికి అంటించాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:45 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ బారినపడ్డాడు. అతను ఇంటికొచ్చి, ఆ కుటుంబంలోని 46 మందికి ఈ వైరస్ అంటించాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయడగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మీట ద్వారా సంక్రమించినట్టు తేలింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నారాయణగూడ పార్ధాగేట్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లారు. వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మిగిలిన ఐదుగురి పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. 
 
అయితే, ఈ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబంలోని 46 మందితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ 46 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, ఈ 46 మంది ఎవరినైనా కలిశారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments