హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్

Webdunia
శనివారం, 23 మే 2020 (20:24 IST)
తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో ఉండే నిరుపేదలకు, దినసరి కూలీలకు నాట్స్ నిత్యావసరాలు పంపిణీ చేసింది.
 
ఇక్కడ నిరుపేదలు పడుతున్న అవస్థల గురించి స్థానిక పెద్దలు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి అక్కడ పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేశారు. స్థానిక శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌ చేతుల మీదుగా ఈ నిత్యావసరాలను నాట్స్ పంపిణీ చేయించింది.
 
కరోనా కష్టకాలంలో పేదలకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేను ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ప్రశంసించారు. అమెరికాలో ఉంటున్న ఇక్కడ వారి కష్టాలు పట్టించుకోవడం.. వారికి సాయం చేయడం అభినందనీయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments