Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ ‌నాటికి తెలంగాణలో కరోనా తగ్గే అవకాశం!

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (19:27 IST)
సెప్టెంబర్‌ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేసుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు చేశారు.

కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను  బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు.  వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి.  మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments