Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగతి భవన్‌ను ప్రజా పాలనా భవన్‌గా మారుస్తాం : రాహుల్ గాంధీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (22:20 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రగతి భవన్‌‍ను పేరును ప్రజా పాలనా భవన్‌గా మారుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణ స్వర్ణయుగానికి నాంది పలుకుతుందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును ప్రజా పాలనా భవన్‌గా మారుస్తామని వెల్లడించారు. అపుడు ఈ భవన్ తలుపులు ప్రజలు కోసం 24 గంటల పాటు తెరిచే ఉంటాయని తెలిపారు. 
 
ముఖ్యంగా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి 24 గంటల పాటు తెరిచి ఉంచడంతో పాటు ప్రజా సమస్య పరిష్కారం కోసం 72 గంటల్లో పరిష్కరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తామన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను తెలంగాణ కాంగ్రెస్ .. "రాహుల్ గాంధీ సంచల ట్వీట్" అంటూ మరోమారు ట్వీట్ చేసింది. 


కార్గో విమానం బోను నుంచి తప్పించుకున్న గుర్రం - హడలిపోయిన సిబ్బంది  
 
న్యూయార్క్ నుంచి బెల్జియంకు బయలుదేరిన కార్గో విమానం బోను నుంచి గుర్రం ఒకటి తప్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది హడలిపోయారు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి.. తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానం బరువు ఎక్కువగా ఉండటంతో 20 టన్నుల ఇంధన సముద్రంపాలు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూయార్క్ నుంచి బెల్జియంకు కార్గో విమానంలో తరలిస్తున్న ఓ గుర్రం.. కార్గో విమానంలోని బోను నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత ఈ గుర్రం విమానంలో అటూఇటూ తరగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బెల్జియంకు ఇటీవల బోయింగ్ 747 కార్గో విమానం బయలుదేరింది. అందులో గుర్రాన్ని తరలిస్తుండగా విమానం బయలుదేరిన అర్థ గంట తర్వాత బోను నుంచి తప్పించున్న గుర్రం బయటకు వచ్చి అటూ ఇటూ తిరగసాగింది. దీన్ని చూసిన విమాన సిబ్బంది హడలిపోయారు. 
 
గుర్రం ఒక్కసారిగా బోను నుంచి దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశఆరు. కాగా, విమానం వెనక్కి వస్తున్న సమయంలో బరువు ఎక్కువగా ఉన్న కారణంగా 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటింగ్ మహా సముద్రంల పారబోసినట్టు విమాన సిబ్బంది తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments