ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం : పోలీసుల వెల్లడి

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (18:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రూపు-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకోగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాన్ని పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ప్రాణాలు తీసుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని హైదరాబాద్ చిక్కడపల్లి ఏసీ ఏ.యాదగిరి వెల్లడించారు.
 
ఇదే అంశంపై హైదరాబాద్ నగర పోలీసులు స్పందిస్తూ, ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈమె చనిపోయినట్లు శుక్రవారం సాయంత్రం తమకు సమాచారం అందిందని, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు చెప్పారు. పైగా, ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరుకాలేదని చెప్పారు. 
 
ఆమెకు శివరామ్ రాథోడ్ అనే యువకుడితో పరిచయం ఉందని, అతనితో చాటింగ్ కూడా చేసినట్టు గుర్తించామని తెలిపారు. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు. ప్రవళిక, శివరామ్ ఇద్దరూ ఓ హోటల్‌కు వెళ్లారని, ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ దొరికిందని తెలిపారు.
 
శివరామ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవళిక సెల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు. వ్యక్తిగత కారణాలతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments