పువ్వు పార్టీకి చెవిలో పువ్వు, రేవంత్ రెడ్డి రాకతో మారుతున్న రాజకీయాలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (15:52 IST)
తెలంగాణాలో తమకు తిరుగులేదంటోంది టిఆర్ఎస్. రాబోయే కాలంలో అత్యంత బలంగా ఎదిగే పార్టీ బిజెపి. మొన్నటి వరకు ఇదే మాటలు రెండు పార్టీల నేతల నుంచి వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఇక కనుమరుగైపోయిందని అందరూ అనుకున్నారు. పార్టీ ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతుండడం ప్రధాన కారణంగా అందరూ భావించారు. 
 
కానీ రేవంత్ రెడ్డి పార్టీలోకి రావడం.. టిపీసీసీగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ రెడ్డి దూకుడుతో పార్టీలోకి పాత నేతలందరూ క్యూ కట్టడం ఖాయమంటున్నారు. రేవంత్ వేగంతో టిఆర్ఎస్ కన్నా బిజెపికే ఎక్కువ నష్టమని భావిస్తున్నారు. 
 
ఇప్పటికే కొంతమంది బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్థం చేసుకున్నారట. అందులో మొదటి వ్యక్తి వీరేందర్ గౌడ్. ఈమధ్యనే రేవంత్ రెడ్డి ఆయన్ను కలిశారట. అలాగే విక్రమ్ గౌడ్. జిహెచ్ ఎంసి ఎన్నికల్లో తన అనుచరులకు టిక్కెట్టు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారట.
 
ఇలా వీరిద్దరే కాదు..చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలన్న నిర్ణయంతో ఉన్నారట. పువ్వు పార్టీకి చెవిలో పువ్వు పెట్టి.. షేక్ హ్యాండ్‌తో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ కొంతమందిని స్వయంగా వెళ్ళి పిలిస్తే మరికొంతమంది మాత్రం వారికి వారే వెళ్ళిపోవడానికి సిద్థమవుతున్నారట. మరి చూడాలి తెలంగాణా రాజకీయాలు ఏవిధంగా మారనున్నాయన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments