Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:25 IST)
హైదరాబాద్‌ దుర్గంచెరువులో నిర్మితమైన కేబుల్‌ బ్రిడ్జి అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 19న దాని ప్రారంభోత్సవం జరుగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్‌ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇప్పటికే దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్‌మంటూ ఆకర్షించే రీతిలో విద్యుత్‌ కాంతులు అందరినీ కట్టి పడేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఐటి కారిడార్‌ను కేబుల్‌ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు.

233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‌మంటోంది. కేబుల్‌ బ్రిడ్జికి రెండువైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments