Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తాం: చంద్రబాబు హెచ్చరిక

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:18 IST)
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆగడాలు మరీ మితిమీరి పోతున్నాయని, పిచ్చిపిచ్చి వేషాలు వస్తే తోకలు కత్తిరిస్తామని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలతో జరిగిన ఆన్లైన్ చంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ...  ‘సొంత మద్యం బ్రాండ్లు పెట్టుకుని ఇష్టానుసారం రేట్లు పెంచి.. వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకను బ్లాక్‌ చేసి ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.

ఇళ్లస్థలాల పేరుతో భూములు కొనుగోలు చేసి వందల కోట్లు గడించారు. దౌర్జన్యంగా ఇతరుల నుంచి గనులు లాక్కుంటున్నారు. ఆ పార్టీ వారు తప్ప ఇతరులు టెండర్లు వేసే పరిస్థితి లేదు. ప్రతి పనికీ కమీషన్లు.. ప్రతి పనిలో వాటాలు ఈ ప్రభుత్వ విధానంగా మారిపోయాయి’ అని విరుచుకుపడ్డారు.

ఒక ప్రభుత్వం 16నెలల్లోనే ఇంత ఘోరమైన అవినీతికి పాల్పడడం చరిత్రలో లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ నేతలు ఆ బురదను టీడీపీపై చల్లి తప్పించుకోవాలని చూస్తున్నారని, టీడీపీ పాలనపై అవినీతిముద్ర వేయడానికి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ నేత ఫిర్యాదు చేశాడని.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక సహా భూక్యా కుటుంబీకులను చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లో నిర్భంధించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ చిన్నారిలో మీకు ఏ నేరస్థుడు కన్పించాడని ట్విటర్‌లో ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments